గవర్నర్‌కు స్వల్ప అస్వస్థత

Mar 23,2024 22:50 #slightly unwell, #The ap Governor

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :గవర్నర్‌ ఎస్‌ అబ్ధుల్‌ నజీర్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. మణిపాల్‌ ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యారు. సాధారణ మెడికల్‌ చెకప్‌లో భాగంగానే మణిపాల్‌ ఆసుపత్రిలో శనివారం అడ్మిట్‌ అయినట్లు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఆదివారం ఉదయం ఎండోస్కోపీ టెస్టులు నిర్వహించిన అనంతరం గవర్నర్‌ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ కానున్నట్లు సమాచారం.

➡️