గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలు పరిష్కరించండి

Dec 11,2023 20:17
  • సిసిఎల్‌ఎకు వినతిపత్రం సమర్పించిన సంఘం నేతలు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విఆర్‌ఎలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ భూ పరిపాలన అధికారికి వినతిపత్రం అందజేశారు. సోమవారం నాడు ఎపి గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శి టి.అంజి, కె.ఉమామహేశ్వరరావు, ఉపాధ్యక్షురాలు షేక్‌ మొగలాబి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ బందగీ సాహెబ్‌ సిసిఎల్‌ఎను కలిసి డిమాండ్లు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. బిఎల్‌ఒ డ్యూటీ నుంచి విఆర్‌ఎలకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం ప్రకటించిన డిఎను 2018 జూన్‌ నుండి ఇవ్వాలని, తెలంగాణ తరహాలో విఆర్‌ఎలకు పే స్కేల్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. తక్షణమే విఆర్‌ఒ పోస్టులను భర్తీ చేయాలని, విఆర్‌ఎలకు 30శాతం ఉన్న పర్సెంటేజిని 70శాతానికి పెంచి విఆర్‌ఒ పోస్టు ప్రమోషన్‌ ఇవ్వాలని, సిపిటి ఎగ్జామ్‌ రద్దు చేయాలని కోరారు. విఆర్‌ఎ విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు మరణించిన వారికి ప్రభుత్వం రూ.20లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలన్నారు.

➡️