గ్రూప్‌ -1 ప్రిలిమ్స్‌ హాల్‌ టికెట్లు విడుదల

Mar 10,2024 14:58 #Group-1, #haltickets, #released

అమరావతి: ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 పరీక్ష హాల్‌ టికెట్లు విడుదలయ్యాయి. రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో మొత్తం 81 గ్రూప్‌- 1 పోస్టుల భర్తీకి జనవరి 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. మార్చి 17న గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. 18 జిల్లా కేంద్రాల్లోని పలు సెంటర్లలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పేపర్‌ 1బీ మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పేపర్‌ 2 పరీక్ష జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 1,48,881 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులు తమ ఓటీపీఆర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

➡️