చంద్రబాబు పాలన విషవృక్షం.. వైసీపీ పాలన కల్పవృక్షం : ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌

Feb 15,2024 17:47 #ap cm jagan, #speech

అమరావతి : ఏపీని ఐదేండ్ల పాటు పరిపాలించిన టీడీపీ చంద్రబాబు పాలన విషవృక్షమైతే వైసీపీ పాలన కల్పవృక్షంలాంటిదని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ఫిరంగీపురం గ్రామంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ టీడీపీ హయాంలో ఏర్పాటుచేసిన జన్మభూమి కమిటీలు గంజాయి మొక్కలని విమర్శించారు.పేదవాళ్లకు మంచి చేయాలన్న తపన చంద్రబాబుకు లేదని దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికల్లో సాధ్యం కాని హామీలతో మోసం చేసేందుకు వస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు హామీలను ప్రజలు నమ్మవద్దని కోరారు. లంచం లేని సంక్షేమ పాలనను అందిస్తున్నామని వెల్లడించారు. పేదల భవిష్యత్తు మార్చేందుకు యుద్ధానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. రెండు జాతీయ పార్టీలతో పాటు టీడీపీ, జనసేన వైసీపీపై దాడి చేస్తున్నాయని పేర్కొన్నారు.

➡️