చీరాలలో అంగన్వాడీ కార్యకర్తలు అరెస్టు

Jan 19,2024 09:45 #Anganwadi Workers, #arrested, #chirala

ప్రజాశక్తి – చీరాల (బాపట్ల) : అంగన్వాడి కార్యకర్తల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం నెల రోజులకు పైగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన సమ్మెలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపద్యంలో శుక్రవారం విజయవాడలో జరగనున్న నిరసన దీక్షలో పాల్గనేందుకు వెళుతున్న అంగన్వాడీ కార్యకర్తలను ఈపురిపాలెం పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరని, ప్రభుత్వం అంగన్వాడి ల సమస్యలు వెంటనే పరిష్కరించాలంటూ.. నేతలు డిమాండ్‌ చేశారు. సిఐటియు జిల్లా నాయకులు సి హెచ్‌ గంగయ్య, డివిజన్‌ అధ్యక్షులు ఎన్‌ బాబురావు అంగన్వాడీల అరెస్టును ఖండించారు.

➡️