జగన్‌కు ఆ భవనాలను తాకట్టు పెట్టే హక్కు ఎవరిచ్చారు : దేవినేని ఉమా

అమరావతి: ప్రభుత్వ భవనాలు, సచివాలయాన్ని తాకట్టు పెట్టే హక్కు సీఎం జగన్‌కు ఎవరిచ్చారు? అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. ఆదివారం టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ…. జగన్‌ అఘాయిత్యాల వల్ల అమరావతి రైతులు కొంతమంది జైళ్లకెళ్లగా.. మరికొంతమంది ప్రాణాలర్పించారని చెప్పారు. ఏపీకి రూ. 12 లక్షల కోట్లు అప్పు తెచ్చి ఏం చేశారు? అని నిలదీశారు. టీడీపీ అధినేత చంద్రబాబు రూ.68 వేల కోట్లతో పెండింగ్‌ ప్రాజెక్టులను పరుగులెత్తించారని తెలిపారు. చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేస్తే.. దీంతోపాటు అనేక ప్రాజెక్టులను జగన్‌ పడకేయించారని మండిపడ్డారు. నిన్న విశాఖ ప్రభుత్వ కార్యాలయాలు, నేడు రాష్ట్ర సచివాలయం, రేపు ప్రైవేట్‌ భూములు ఇలా తాకట్టు పెడుతున్నారని ధ్వజమెత్తారు.

ఆర్టీసీ ఛార్జీలు, నిత్యవసర వస్తువుల ధరలు, చెత్తపన్ను, విద్యుత్‌ ఛార్జీలతో జనం విలవిలలాడుతున్నారని అన్నారు. సెంటు పట్టా పేరుతో రూ. 7 వేల కోట్లు లూటీ చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు పోలవరాన్ని 72 శాతం పూర్తి చేయిస్తే, జగన్‌ ఏం చేశాడు? అని ప్రశ్నించారు. నాడు-నేడు పథకంలో రంగులు వేయడం, ప్రహరీగోడ, మట్టి, ప్లాస్టింగ్‌ పనుల్లో లూటీ చేశారని దుయ్యబట్టారు. కోర్టుల్లో కేసులు వేయడానికి వందల కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయలేదా అని నిలదీశారు. జగన్‌ రాయలసీమ, రైతాంగ ద్రోహి అని మండిపడ్డారు. చంద్రబాబు ఇరిగేషన్‌ను స్వర్ణ యుగంగా మార్చారని తెలిపారు. జగన్‌ దోపిడి, అవినీతి కార్యక్రమాలకు పుల్‌ స్టాప్‌ పడనుందని దేవినేని ఉమ హెచ్చరించారు.

➡️