జర్నలిస్టులకు తెల్ల రేషన్‌ కార్డులు : సిఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టులకు శుభవార్త చెప్పింది. సీఎం రేవంత్‌ రెడ్డి చిట్‌ చాట్‌ లో మాట్లాడుతూ.. జర్నలిస్టులకు తెల్ల రేషన్‌ కార్డులు.. ఆరోగ్య శ్రీకి ప్రత్యేక కార్డు ఇస్తాం అని సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు. మరోవైపు.. వ్యవసాయం చేసే భూములకు రైతు భరోసా అందిస్తామని తెలిపారు. ఇదిలా ఉంటే.. నేషనల్‌ హైవేలు, రియల్‌ ఎస్టేట్‌ భూములకు ఇవ్వమని పేర్కొన్నారు. పెట్టుబడి సాయం అందాల్సింది రైతులకు అని తెలిపారు. సాగులో ఉన్న భూములకే పెట్టుబడి సాయం అందాలని సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు. అన్ని విషయాల పై చర్చ చేసి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

➡️