జోరుగా కోడిపందేలు.. రూ.లక్షల్లో చేతులు మారుతున్న నగదు

Jan 15,2024 07:46 #bheemavaram, #kodi pandalau

భీమవరం: సంక్రాంతి సందర్భంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కోడిపందేలు కొనసాగుతున్నాయి. ఆకివీడు, నిడమర్రు, జంగారెడ్డిగూడెం, ఉండి, భీమవరం, నరసాపురం తదితర ప్రాంతాల్లో జోరుగా జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం నుంచే పందెంరాయుళ్లు బరుల్లోకి దిగారు. రూ.లక్షల్లో నగదు చేతులు మారుతోంది. ఉండి మండలం మహదేవపట్నంలో కోడిపందేల కోసం ప్రత్యేకంగా మైదానం ఏర్పాటు చేశారు. పందేల వీక్షణకు చుట్టూ ఫ్లడ్‌లైట్లు, ఎల్‌ఈడీ స్క్రీన్లు పెట్టారు.

➡️