టిడిపి కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన నారా భువనేశ్వరి

Feb 7,2024 14:44 #Nara Bhuvaneshwari, #speech

ప్రత్తిపాడు: ‘నిజం గెలవాలి’ యాత్రలో భాగంగా గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో టిడిపి అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్‌తో మనస్తాపానికి గురై మృతిచెందిన కార్యకర్తల కుటుంబాలను ఆమె పరామర్శించారు. నియోజకవర్గ పరిధిలోని బుడంపాడులో మైలా శివయ్యయాదవ్‌, అనంతవరప్పాడులో కోటేశ్వరరావు కుటుంబాలను ఓదార్చారు. ఒక్కో కుటుంబానికి రూ.3లక్షల చొప్పున ఆర్థికసాయం చెక్కులను అందజేశారు. ఆయా కుటుంబాలకు టిడిపి అండగా ఉంటుందని భువనేశ్వరి భరోసా ఇచ్చారు.

➡️