టీఎస్‌ ఎడ్‌సెట్‌-2024 నోటిఫికేషన్‌ విడుదల.. మే 23న రాతపరీక్ష

Feb 10,2024 16:16 #job notification, #ts edset

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని బీఎడ్‌ కాలేజీల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే టీఎస్‌ ఎడ్‌సెట్‌ ప్రవేశ పరీక్షకు సంబంధించిన షెడ్యూల్‌ విడుదలైంది. మార్చి 4వ తేదీన టీఎస్‌ ఎడ్‌సెట్‌-2024 నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు ఎడ్‌సెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ టీ మఅణాళిని వెల్లడించారు.మార్చి 6వ తేదీ నుంచి దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా స్వీకరించనున్నారు. ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా మే 6వ తేదీ వరకు దరఖాస్తులను సమర్పించొచ్చు. ఆలస్య రుసుంతో మే 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 23న కంప్యూటర్‌ బేస్డ్‌ విధానంలో రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండు విడతల్లో రాతపరీక్ష నిర్వహించనున్నారు.

➡️