ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఈఈ ఇంట్లో ఏసీబీ సోదాలు

Feb 20,2024 15:40 #ACB RIDS, #tribal welfare ee

హైదరాబాద్‌ : రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్‌ విభాగం అధికారిణి సోమవారం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ నగరంలోని మాసబ్‌ట్యాంక్‌ పరిధిలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీర్‌గా పని చేస్తున్న కే జగజ్యోతి బిల్లుల మంజూరుకు కాంట్రాక్టర్‌ బడుకం గంగన్న నుంచి రూ. 84 వేలు లంచం డిమాండ్‌ చేశారు. దీంతో గంగన్న ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు.. ఆమె లంచం తీసుకుంటుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఈ క్రమంలో జగజ్యోతి ఇంట్లో ఏసీబీ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ నగదు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఇప్పటి వరకు మొత్తం రూ. 65 లక్షల నగదు, 4 కిలోల బంగారం ఆభరణాలను స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు తెలిపారు. జగజ్యోతి ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి.జగజ్యోతిని కోర్టులో ప్రవేశపెట్టే కంటే ముందు ఆమెకు ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మరికాసేపట్లో కోర్టులో హాజరు పరిచి, రిమాండ్‌కు తరలించనున్నారు.

➡️