ట్విట్టర్‌ ఖాతా సేఫ్‌.. ప్రొఫైల్‌ పిక్‌ అప్‌డేట్‌ చేసిన గవర్నర్‌ తమిళిసై

హైదరాబాద్‌: గవర్నర్‌ తమిళిసై ట్విట్టర్‌ అకౌంట్‌ హ్యాక్‌పై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. అకౌంట్‌ సెక్యూర్డ్‌గా ఉన్నట్లు తెలిపారు. దీంతో గవర్నర్‌ తమిళిసై ప్రొఫైల్‌ పిక్‌ను అప్‌డేట్‌ చేశారు. ఈ నెల 14న గవర్నర్‌ ట్విట్టర్‌ (ఎక్స్‌) ఖాతాను సైబర్‌ నేరగాళ్లు హ్యాక్‌ చేసిన విషయం తెలిసిందే. రాజ్‌భవన్‌ అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదుచేశారు. దర్యాప్తులో భాగంగా దేశంలోని మూడు ఐపీ అడ్రస్‌ల నుంచి ఆపరేట్‌ అయినట్లు గుర్తించారు.హాత్‌వే, యాక్ట్‌ సహా మరో ఇంటర్నెట్‌ సర్వీస్‌ ద్వారా గవర్నర్‌ తమిళిసై ట్విట్టర్‌ ఖాతాను హ్యాక్‌ చేసేందుకు ప్రయత్నించినట్లు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఆ ఐపీ అడ్రస్‌ల వివరాలు ఇవ్వాలని సర్వీస్‌ ప్రొవైడర్లను పోలీసులు కోరారు. వివరాలు అందిన వెంటనే నిందితులను పట్టుకుంటామని వెల్లడించారు. హ్యాక్‌కు గురైన సమయంలో గవర్నర్‌ ట్విట్టర్‌ అకౌంట్‌ ప్రొఫైల్‌ ఖాళీగా కనిపించిన విషయం తెలిసిందే.

➡️