డిప్యూటీ సీఎం భట్టి అధికారిక నివాసంగా ప్రజాభవన్‌

హైదరాబాద్‌ : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా మహాత్మ జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌ ను కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భట్టి విక్రమార్క డిసెంబర్‌ 14న ఉదయం 8.20 గంటలకు ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. మాజీ సీఎం కేసీఆర్‌ హయాంలో బేగంపేటలో నిర్మించిన ప్రగతి భవన్‌ సీఎం అధికారిక నివాసంగా ఉండేది. అయితే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రగతి భవన్‌ ను మహాత్మ జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌ గా మార్చారు. సీఎం రేవంత్‌ ఇటీవల తొలిసారి ప్రజాదర్భార్‌ కూడా నిర్వహించారు. ప్రజాభవన్‌ లో ప్రతీ మంగళవారం, శుక్రవారం ప్రజావాణిని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇపుడు ఈ ప్రజాభవన్‌ ను డిప్యూటీ సీఎం అధికారికి నివాసంగా కేటాయించారు.

➡️