తుపాన్‌ భాధితులను ఆదుకోవడంలో జగన్‌ సర్కార్‌ విఫలం : వి శ్రీనివాసరావు

విశాఖ: రాష్ట్రంలో మీచౌంగ్‌ తుపాన్‌ భాధితులను ఆదుకోవడంలో జగన్‌ సర్కార్‌ విఫలం అయిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మీచౌంగ్‌ తుపాన్‌ భాధితులను ఆదుకోవడంలో జగన్‌ సర్కార్‌ విఫలం అయిందని, సీఎం చెబుతున్న దానికి… క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పనులకు పొంతన లేదని విమర్శించారు. రాష్ట్రంలో వైసీపీకి తీవ్ర వ్యతిరేకత ఉందని.. మేము ప్రత్యామ్నయ శక్తిగా ఎదుగుతామన్నారు. సీఎం జగన్‌ ప్రజలను కలవరని, ఏమైనా ఉంటే సజ్జలకు చెప్పుకోవల్సిందేనన్నారు.సీఎం జగన్‌ తన వైఖరి మార్చుకోకపోతే, తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు పట్టిన గతే వైసీపీకి పడుతుందని శ్రీనివాసరావు అన్నారు. ధాన్యం ఉత్పత్తి తగ్గిందని దీంతో బియ్యం ధరలు పెరుగుతాయన్నారు. అఖిల పక్ష సమావేశాన్ని తక్షణమే జగన్‌ ఏర్పాటు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించి.. పది వేల కోట్లు ప్రకటించి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.రైల్వే జోన్‌కు భూములు ఇవ్వలేదని బీజేపీ నేతలు సాకులు చెబుతున్నారని, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌, రైల్వే జోన్‌ విషయంలో బీజేపీ మోసం చేస్తోందని శ్రీనివాసరావు ఆరోపించారు. స్టీల్‌ ప్లాంట్‌ మూసి వేయమని పార్లమెంట్‌లో బీజేపీ ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. బీజేపీ ఇప్పటి వరకు ప్రజా ద్రోహం చేసిందని, రాముడు పేరు చెప్పి దైవ ద్రోహానికి పాల్పడుతోందని వి. శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో విమర్శించారు.

➡️