తెలంగాణ కొత్త ప్రభుత్వానికి సీఎం జగన్‌ అభినందనలు

Dec 7,2023 18:55 #ap cm jagan, #tweets

అమరావతి: తెలంగాణలో కొలువుదీరిన నూతన ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు సీఎం వైఎస్‌ జగన్‌.. ‘తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు.”ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి, మంత్రులకు శుభాకాంక్షలు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం పరిఢవిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని ఎక్స్‌(ట్విటర్‌)లో పేర్కొన్నారు.

➡️