తెలంగాణ మద్యంతో పట్టుబడ్డ ప్రభుత్వ విప్‌ వ్యక్తిగత ఫోటోగ్రాఫర్‌

Feb 15,2024 15:36 #liquor bottles, #seized

అమరావతి : ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను వ్యక్తిగత ఫోటోగ్రాఫర్‌ భారీగా తెలంగాణ మద్యం పట్టుబడింది. జగ్గయ్యపేట పోలీస్‌ స్టేషన్‌ ఎస్సై- 1 సూర్య భగవాన్‌ తనిఖీలు నిర్వహించగా.. బలుసుపాడు జంక్షన్‌లో ఆటోలో భారీ మొత్తంలో తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బలుసుపాడుకి చెందిన అమ్మనబోయిన గోపాలకఅష్ణ(గోపీ) , రెడ్లకుంటకు చెందిన పోలంపల్లి రామకఅష్ణులు తెలంగాణ నుంచి మద్యం తెచ్చి అమ్మకాలు జరుపుతున్నట్లు గుర్తించారు. అయితే పట్టుబడిన గోపీ.. ప్రభుత్వ విప్‌ ఉదయభానుకు వ్యక్తిగత ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. దాదాపు రూ.62220 విలువ గల 613 బాటిల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు వారిని జగ్గయ్యపేట కోర్టులో హాజరుపరిచారు. కాగా… గతంలోనూ గరికపాడు చెక్‌పోస్ట్‌ తనిఖీల్లో తెలంగాణ మద్యంతో గోపి పట్టుబడిన విషయం తెలిసిందే.

➡️