విస్తృత ధర్మాసనానికి చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌

న్యూఢిల్లీ : టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. 17 ఏ వర్తింపు పై ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసింది. చంద్రబాబు దాఖలు చేసిన క్యాష్‌ పిటిషన్‌ ను సుప్రీం కోర్టు అనుమతించలేదు. 17 ఏ వర్తిస్తుందని జస్టిస్‌ అనిరుద్ద బోస్‌, వర్తించదన్న జస్టిస్‌ భేలా ఎమ్‌ త్రివేదిలు తెలిపారు. విస్తృత ధర్మాసనానికి బదిలీ కోసం సిజెఐ కి రిఫర్‌ చేస్తూ జస్టిస్‌ భేలా ఎమ్‌ త్రివేది, జస్టిస్‌ అనిరుద్ద బోస్‌ లతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది.

➡️