దేశభక్తి ఉద్యమంగా మారాలి – విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ

Mar 27,2024 22:54 #visakha steel plant
visakha-steel-plant manganese mines

ప్రజాశక్తి-ఉక్కునగరం (విశాఖపట్నం) :విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ కోసం జరుగుతున్న పోరాటం దేశభక్తి ఉద్యమంగా మారాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు అన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ పోరాట కమిటీ ఆధ్వర్యాన కూర్మన్నపాలెంలో చేపట్టిన దీక్షలు బుధవారం నాటికి 1140వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా పోరాట కమిటీ నాయకులు డిసిహెచ్‌ వెంకటేశ్వరరావు, డి.ఆదినారాయణ మాట్లాడుతూ.. ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. ప్రజల సహకారంతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ ఎన్నికల సమయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచుతామని తెలిపారు.

➡️