నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షుడిగా మంత్రి శ్రీధర్‌ బాబు

హైదరాబాద్‌: నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షుడిగా కాంగ్రెస్‌ నేత, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన ఎగ్జిబిషన్‌ మేనిజింగ్‌ కమిటీ సమావేశంలో శ్రీధర్‌ బాబును ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్నారు. కాగా, ప్రతి ఏడాది హైదరాబాద్‌ మహానగరంలో నాంపల్లిలో నూమాయిష్‌ను ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశం నలుమూలల నుంచి ఈ నూమాయిష్‌కు ప్రజలు తరలివస్తుంటారు. ఈ సారి కూడా జనవరిలోనే నూమాయిష్‌కు రంగం సిద్దమవుతున్నది. తాజాగా నిర్వహకులు స్టాల్స్‌ ఏర్పాట్లు చేస్తున్నారు.

➡️