నా కుమారుడి జీవితాన్ని జగన్‌ నాశనం చేశారు: కోడికత్తి శ్రీను తల్లి

Jan 14,2024 15:09 #kodi kathi case

గుంటూరు: కోడికత్తి కేసులో నిందితుడిగా ఉన్న తన కుమారుడు శ్రీను దాదాపు ఐదేళ్లుగా జైలులోనే మగ్గుతున్నాడని.. న్యాయం చేయాలని అతడి తల్లి సావిత్రి కోరారు. గుంటూరు లాడ్జి సెంటర్‌లో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద శ్రీను తల్లి, సోదరుడు నిరసన తెలిపారు. సీఎం జగన్‌ న్యాయస్థానానికి హాజరుకావడం లేదని.. తన కుమారుడికి బెయిల్‌ రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. శ్రీను జీవితాన్ని ఆయన నాశనం చేశారన్నారు. జీవిత చరమాంకంలో అండగా ఉండాల్సిన కుమారుడు జైలులో ఉండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కంటతడి పెట్టుకున్నారు. దళిత సంఘాల నేతలు ఆమెకు మద్దతు తెలుపుతూ నిరసనలో పాల్గన్నారు. జగన్‌ తన అధికారాన్ని అడ్డు పెట్టుకుని కావాలనే విచారణకు హాజరుకాకుండా కాలయాపన చేస్తున్నారని నేతలు మండిపడ్డారు. న్యాయ పోరాటంలో శ్రీను కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు.

➡️