నా రాజకీయం జీవితంలో ఇలాంటి సీఎంను చూడలేదు: మంత్రి పెద్దిరెడ్డి

అమరావతి: తన 45 సంవత్సరాల రాజకీయం జీవితంలో పేదల కోసం ఈ స్థాయిలో పని చేసిన ముఖ్యమంత్రిని చూడలేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘సీఎం వైఎస్‌ జగన్‌ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసం కఅషి చేస్తున్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి నారా చంద్రబాబు నాయుడు చేసింది ఏమీ లేదు. వైఎస్‌ జగన్‌ మొదటిసారి ముఖ్యమంత్రి అవ్వగానే అన్ని బీసీ కులాలకు కార్పొరేషన్లు తెచ్చారు. నా 45 సంవత్సరాల రాజకీయం జీవితంలోనే పేదల కోసం ఈ స్థాయిలో పని చేసిన ముఖ్యమంత్రిని చూడలేదు’ అని మంత్రి పెద్దిరెడ్డి చెప్పుకొచ్చారు.అన్నమయ్య జిల్లా మదనపల్లిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. మదనపల్లిలో నిర్వహిస్తున్న శ్రీ భక్త కనకదాసు 536వ జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరయ్యారు.మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ‘కుప్పంలో చాలా పెద్ద ఎత్తున కనకదాసు విగ్రహ ఆవిష్కరణ చేశాం. భక్త కనకదాసు జయంతిని ప్రతి ఏటా జరుపుకోవాలి. తిమ్మప్పగా జన్మించి అయన భక్త కనకదాసగా మారారు. అయన జీవితం అందరికీ ఆదర్శం. మన కురభ కులంలో అంత గొప్ప వ్యక్తి పుట్టడం అందరి అదఅష్టం. భక్త కనకదాస విగ్రహాలు ఏర్పాటు, ఆవిష్కరణకు అన్ని విధాలా తోడుగా ఉంటాం’ అని అన్నారు.

➡️