పనుల మీద కంటే ప్రచారం మీద ఫోకస్‌ చేసి ఉంటే బీఆర్‌ఎస్‌ గెలిచేది : కేటీఆర్‌

Jan 11,2024 15:45 #KTR, #speech

మహబూబాబాద్‌ : పనుల మీద కంటే ప్రచారం మీద ఫోకస్‌ చేసి ఉంటే బీఆర్‌ఎస్‌ గెలిచేదని బీఅర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహబూబాద్‌ పార్లమెంట్‌ నియోజకర్గ సన్నాహక సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ అబద్ధాల ముందు అభివఅద్ధి ఓడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పనుల మీద కంటే ప్రచారం మీద ఫోకస్‌ చేసి ఉంటే బీఆర్‌ఎస్‌ గెలిచేదని అన్నారు. వందలాది సంక్షేమ కార్యక్రమాలు మన ప్రభుత్వ హయాంలో అమలు చేసినా, ఏనాడు కూడా ప్రజలను లైన్లలో నిలబెట్టలేదని స్పష్టం చేశారు. ప్రజల సౌకర్యమే చూసాము కానీ రాజకీయ ప్రయోజనము, రాజకీయ ప్రచారమే గురించి ఏనాడు ఆలోచించలేదని అన్నారు. ప్రజలు బీఆర్‌ఎస్‌ ను పూర్తిగా తిరస్కరించలేదని అన్నారు.బీఆర్‌ఎస్‌కి మూడో వంతు సీట్లు 39 వచ్చాయి. 14 స్థానాల్లో ఓటమి కేవలం గరిష్టంగా 6 వేల ఓట్ల తోనే జరిగింది. మొత్తంగా కాంగ్రెస్‌ మనకు తేడా కేవలం 1.85 శాతం అన్నారు. పార్టీ సమావేశాలను వరుసగా పెట్టుకుంటామని అన్నారు. అనుబంధ సంఘాలను బలోపేతం చేస్తామని తెలిపారు. పార్టీకి అన్ని వర్గాలను దగ్గరయ్యేలా కార్యక్రమాలు చేపడతామని అన్నారు. గిరిజనులకు స్థానిక సంస్థల రిజర్వేషన్‌ తో పాటు.. పొడు భూముల పట్టాల పంపిణీ, అనేక ఇతర సంక్షేమ పథకాలు అనేక కార్యక్రమాలను మన ప్రభుత్వం గతంలో అందించిందన్నారు. అయినా గిరిజనం ఎక్కువ ఉన్న చోట్లకూడా ప్రజలు పూర్తి మద్దతు మనకివ్వలేదు, ఇలాంటి వాటన్నింటి సమీక్ష చేసుకుని ముందుకుపోతామన్నారు.ఇక మహబూబాబాద్‌ లోకసభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి ,ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ లో ఎవరికి వారే యమునా తీరే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ 420 హామీలు నెరవేర్చే పరిస్థితి ఉండదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌ ,హరీష్‌ రావు లు కఅష్ణార్జునులు వారు కలిసికట్టుగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని కోరారు. కార్యకర్తలకు అగ్రనాయకత్వం అందుబాటులో ఉండాలని తెలిపారు.

➡️