పరీక్ష మిస్‌ కావడంతో విద్యార్థి ఆత్మహత్య

Feb 29,2024 14:46 #commited suicide, #student

ఆదిలాబాద్‌ : ఆదిలాబాద్‌ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పరీక్షలు మిస్‌ అయ్యాయననే మనస్థాపంతో ఓ విద్యార్థి నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలంలో చోటు చేసుకుంది. జైనథ్‌ మండలం మాంగూర్ల గ్రామానికి చెందిన శివకుమార్‌ అనే ఇంటర్‌ విద్యార్థి సాత్మల ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పరీక్షలు మిస్‌ చేసినందుకు తనను క్షమించాలంటూ సుసైడ్‌ నోట్‌ రాసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శివకుమార్‌ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

➡️