పల్ల వెంకన్న నర్సరీలో కనివిందు చేస్తున్న వెల్కమ్ పొంగల్

Jan 15,2024 19:49 #East Godavari

ప్రజాశక్తి-కడియం(తూర్పుగోదావరి) : మొక్కల ఉత్పత్తి ,పెంపకం, కూర్పులో కడియం నర్సరీ రైతుల ప్రత్యేకత వేరు.నర్సరీ రైతులు పెంచిన మొక్కలతో సందర్భాన్ని బట్టి వర్ణ, వైవిద్యమైన సందేశాలు ఇచ్చేలా కూర్పులు రూపు దిద్దుతారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా కడియం పల్ల వెంకన్న నర్సరీలు ఏర్పాటు చేసిన వెల్కo పొంగల్ సందర్శకులను విశేషంగాఆకట్టు కుంటుంది. భోగి, సంక్రాంతి,కనుమ మూడు పర్వదినాల వైభవాన్ని చాటుతూ దురంతా, అల్ట్రెనేంత్ర వంటి 30 వేలకు పైగా బోర్డర్ రకాల మొక్కలతో తెలుగు లోగిలిలో స్వాగతం పలికారు. నర్సరీ అధినేత పల్ల సత్యనారాయణమూర్తి ఆయన కుమారులు వెంకటేష్, వినయ్ లు వారి నర్సరీని ఒక సందర్శనా ప్రాంతంగా అలంకరింప జేశారు. నర్సరీ రంగంలో వారికున్న శ్రద్ధను పలువురు అభినందిస్తున్నారు.

➡️