పార్టీని నమ్ముకున్న వారిని ఆదుకుంటాం- నారా భువనేశ్వరి

Jan 31,2024 08:04 #nara bhuvaneswari, #speech

ప్రజాశక్తి-చెరుకుపల్లి, పర్చూరు (బాపట్ల జిల్లా):పార్టీ కార్యకర్తలను, పార్టీని నమ్ముకున్న వారిని ఆదుకోవడంలో టిడిపి, ఎన్‌టిఆర్‌ ట్రస్ట్‌ ఎప్పుడూ ముందుంటుందని నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం బాపట్ల జిల్లా, చెరుకుపల్లి, కొల్లూరులో భువనేశ్వరి పర్యటించారు. చెరుకుపల్లి గ్రామానికి చెందిన కోట వెంకటేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించి.. మూడు లక్షల రూపాయల చెక్కును అందజేశారు. పర్చూరు మండలం చిననందిపాడు గ్రామంలో మువ్వ సింగారావు కుటుంబాన్ని పరామర్శించి, రూ. మూడు లక్షల ఆర్థికసాయం అందించారు. ఆమె వెంట ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, ఎమ్మెల్సీ పి.అనూరాధ ఉన్నారు.

➡️