పీవీకి భారతరత్న ఇచ్చి గౌరవించాలి : కేటీఆర్‌

Dec 23,2023 16:45 #KTR, #speech

హైదరాబాద్‌ : తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహరావు వర్ధంతి సందర్భంగా.. పీవీ ఘాట్‌ వద్ద బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నేతలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు నాయకులు పాల్గన్నారు.ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. తెలుగు వారికి, తెలంగాణ వారికి, భారతదేశానికి వన్నె తెచ్చిన నేత పీవీ నర్సింహ రావు అని కొనియాడారు. పీవీ నరసింహారావు ఆనాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌తో కలిసి అప్పుల్లో కూరుకుపోయిన దేశాన్ని గాడిన పెట్టి తన వంతు సేవ దేశానికి అందించారు. పీవీ ఆదర్శాలకు అనుగుణంగా పనిచేయాలి. ఢిల్లీలో పీవీ ఘాట్‌ నిర్మించాలి. పీవీకి భారతరత్న ఇచ్చి గౌరవించాలి. కాంగ్రెస్‌ చేసిన అన్యాయం ఏదైతే ఉందో దాన్ని సరిదిద్దాలి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైతే డిమాండ్‌ చేశామో.. ఇప్పుడు కూడా అదే అడుగుతున్నాం. పీవీ నర్సింహ రావుకి సముచిత స్థానం కల్పించాలి. పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి పీవీ నరసింహా రావు. భూమిని పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చిన వ్యక్తి పీవీ. పేదలకు భూములు పంచడానికి పీవీ బలమైన పునాదులు వేశారు. పీవీ మన మధ్య లేకపోయినా వారి సంస్కరణలు సదా ఆచరణీయం’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

➡️