పీవీ భారత రత్న పై రేవంత్‌ రెడ్డి ట్వీట్‌..!

హైదారాబాద్‌: మాజీ ప్రధాని తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావుకి భారతరత్న ఇవ్వడం మీద తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ఒక పోస్ట్‌ చేశారు. ట్విట్టర్‌ వేదికగా ఆయన స్పందించారు. తెలుగు జాతి కీర్తి ప్రతిష్టల్ని ఆకాశమంత ఎత్తున ఎగరేసిన మన తెలంగాణ బిడ్డ మాజీ ప్రధాని ఆర్థిక మేధావి బహుభాషా కోవిదుడు అయిన నరసింహరావు భారతరత్న దక్కడం గర్వించదగ్గ విషయమని సీఎం రేవంత్‌ రెడ్డి పోస్ట్‌ చేశారు. తెలంగాణ బిడ్డలుగా మనందరి గుండెల్లో ఆనందం ఉప్పొంగే క్షణం అని అన్నారు మాజీ ప్రధాని చరణ్‌ సింగ్‌, ఎల్కే అద్వానీ, కర్పూరి ఠాకూర్‌, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్‌ కి భారత రత్న రావడం నాకు చాలా సంతోషంగా ఉందని పోస్ట్‌ చేశారు . నేడు కేంద్ర భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ని ప్రకటించిన విషయం తెలిసిందే.

➡️