పైప్‌ లైన్‌ లీకేజీకి మరమ్మతు చర్యలు – ప్రజాశక్తి వార్తకు స్పందన

ప్రజాశక్తి – దేవనకొండ (కర్నూలు) : మండల కేంద్రమైన దేవనకొండలోని మాలవీధిలో ప్రధాన రహదారి వెంబడి ఉన్న మంచినీటి పైప్‌ లైన్‌ లీకేజీ తో నీరు కలుషితం, వృధా అవుతున్న తాగునీరు అనే శీర్షికన గత రెండు రోజుల క్రితం ప్రజాశక్తి దినపత్రికలో కథనం ప్రచురితమైన విషయం విదితమే. ఈ వార్తకు స్పందించిన పంచాయతీ కార్యదర్శి అబ్దుల్‌ రహీం పంచాయతీ సిబ్బందితో సోమవారం మరమ్మతు చర్యలు చేపట్టారు. నీరు కలుషితం, నీటి వఅధా కాకుండా చర్యలు తీసుకోవడంపై కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.

➡️