పోలవరం సమస్యల పరిష్కారానికి కృషి -పవన్‌కల్యాణ్‌

Mar 23,2024 22:55 #janasena pawan, #speech

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :తమ కూటమి గెలిచి, అధికారంలోకి వస్తే పోలవరం నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని జనసేన అధ్యక్షులు పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో శనివారం పోలవరం నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలవరం జనసేన నాయకులు చిర్రి బాలరాజుకు ఎన్నికల నియమావళి, నిబంధనలతో కూడిన పత్రాలను పవన్‌కల్యాణ్‌ అందజేశారు. ఈ సమావేశంలో కరాటం రాంబాబు, గడ్డమణుగు రవికుమార్‌, కరాటం సాయి చంద్రమోహన్‌ పాల్గొన్నారు.

➡️