ప్రత్తిపాటి శరత్‌కు బెయిల్‌ మంజూరు

Mar 14,2024 17:45 #bail, #pattipati sarath, #Sanction

విజయవాడ: మాచవరం పోలీసులు పెట్టిన కేసులో మాజీ మంత్రి, టిడిపి సీనియర్‌ నేత ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌కు విజయవాడ ఒకటో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. రూ.25 వేల చొప్పున ఇద్దరు పూచీకత్తులు సమర్పించాలని న్యాయాధికారి బెయిల్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జీఎస్టీ ఎగవేత, నిర్మాణ పనుల్లో నిధుల మళ్లింపునకు పాల్పడ్డారనే ఆరోపణలపై రాష్ట్ర డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పుల్లారావు భార్య, కుమారుడు, బావమరిది సహా ఏడుగురిపై విజయవాడలోని మాచవరం పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

➡️