ఫిబ్రవరి 5నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

Jan 31,2024 16:37 #ap assembly, #meetings

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 7 వరకు సమావేశాలు నిర్వహించాలని కేబినెట్‌ సమావేశంలో నిర్ణయించారు. 5న గవర్నర్‌ ప్రసంగంతో పాటు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. 6, 7 తేదీల్లో బడ్జెట్‌పై చర్చతో పాటు వివిధ సవరణ బిల్లులను సభ ముందు ఉంచే అవకాశముంది.

➡️