బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు గుండెపోటు

Feb 18,2024 15:30 #heart attack, #RTC employees

రంగారెడ్డి : బస్సు నడుపుతుండగానే డ్రైవర్‌ గుండెపోటుతో స్టీరింగ్‌ పైనే కుప్పకూలాడు. దేవరకొండ బస్‌ డిపోకు చెందిన బస్సు నల్లగొండ జిల్లా మల్లేపల్లి నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఘటన జరిగింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బంగళూరు వద్ద జరిగిన ఘటనలో.. అనారోగ్యం పాలైన డ్రైవర్‌ శంకర్‌ నాయక్‌ను 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు.అయితే ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. ఛాతీలో నొప్పి వస్తుందని గమనించిన డ్రైవర్‌.. బస్సును రోడ్డు పక్కనే ఆపేశాడు. అనంతరం స్టీరింగ్‌పై కుప్పకూలాడు. శ్వాస తీసుకోవడంలో డ్రైవర్‌కు ఇబ్బంది తలెత్తింది. దీంతో ప్రయాణికులు 108 అంబులెన్స్‌కు ఫోన్‌ చేసి, ఆస్పత్రికి తరలించారు.

➡️