బాధ్యతలు స్వీకరించిన పొంగులేటి

Dec 14,2023 14:45 #charge, #ponguleti srinivas reddy

హైదరాబాద్‌: రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గఅహనిర్మాణ శాఖా మంత్రిగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి గురువారం భాద్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా మంత్రిని ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, వేముల వీరేశం, ఆదినారాయణ, బాలు నాయక్‌, ఆది శ్రీనివాస్‌, యశస్వినీ రెడ్డి తోపాటు పలువురు సీనియర్‌ నాయకులు రేణుకా చౌదరి, రామసహాయం సురేందర్‌ రెడ్డి, రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌, ఆర్‌ అండ్‌ బీ కార్యదర్శి శ్రీనివాస రాజు, సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్‌ కె. అశోక్‌ రెడ్డి, సమాచార శాఖ డైరెక్టర్‌ రాజమౌళి, అడిషనల్‌ డైరెక్టర్‌ నాగయ్య, జేడీలు జగన్‌, శ్రీనివాస్‌, వెంకట రమణ, డీడీ లు మధు సూధన్‌, హాష్మి, రాజా రెడ్డి, సీఐఈ రాధా కిషన్‌, వివిధ శాఖల ఉన్నతాధికారులు మంత్రిని కలసి శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

➡️