AP Politics: బాబు దాసోహం

* ఎన్డిఎలోకి తెలుగుదేశం
* బిజెపితో పొత్తు కోసం రాష్ట్రానికి మరణశాసనం
* ఇంకా తేలని సీట్ల పంచాయతీ

ప్రజాశక్తి-యంత్రాంగం: 
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బిజెపికి లొంగిపోయారు. రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కి ప్రధాని నరేంద్రమోదీకి దాసోహమన్నారు. గత ఎన్నికల్లో రాష్ట్రంలో ఒక్క శాతం ఓట్లు కూడా సాధించని కమలం పార్టీని నెత్తికెత్తుకోవడం ద్వారా మతోన్మాద కూటమిలో భాగస్వాములయ్యారు. ఫలితంగా రాష్ట్రంలోని మైనార్టీలు, దళితలు, మహిళలను ప్రమాదంలో పడేశారు. ఆత్మగౌరవం, ఫెదరిలజం, సెక్యులరిణం వివాదాలతో ఒకప్పుడు దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న తెలుగుదేశం పార్టీకి ఈ నిర్ణయం ఆత్మహత్య సదృశ్యంగా మారుతుందన్న రాజకీయ పరిశీలకులు హెచ్చరికలను లక్షలాది మంది టిడిపి కార్యకర్తల మనోభావాలను ఆయన బేఖాతరు చేశారు. దేశరాజధాని ఢిల్లీలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాన్తో కలిసి సాగించిన ఒకటన్నర రోజు పడిగాపులు, పొత్తుల డ్రామాకు శనివారం తెరదించారు. కేంద్ర హోంశాఖమంత్రి అమిత్నే, బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డాతో భేటీ అయ్యారు. దాదాపు 50 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలోనే రాష్ట్రాభివృద్ధికి మరణశాసనం వంటి ఒప్పందం కుదిరంది. ఆ సమావేశానంతరం ఢిల్లీ నుండే రాష్ట్రంలోని టిడిపి నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు ‘బిజెపితో పొత్తు ఖరారైంది. అని చెప్పారు. పరిస్థితులను అర్థం చేసుకోవాలని కోరారు. పొత్తులో భాగంగా అవసరమైతే త్యాగాలు చేయాలని సూచించారు. ఇటువంటి కీలక నిర్ణయాల తరువాత ఆ ఒప్పందంలో భాగస్వాములైన నేతలు సహజంగా పిండియా ముందుకు వస్తారు. దాదాపు పదేళ్ల తరువాత ఎన్టిఎ కూటమిలో తిరిగి చేరిన దంద్రబాబుగానీ, చేర్చుకున్న బిజెపి నేతలు గానీ విలేకరుల ప్రశ్నలు తీసుకోవడానికి సిద్ధపడలేదు. ఎటువంటి మీడియా సమావేశం నిర్వహించలేదు. దానికి బదులుగా టిడిపి, జనసేన, బిజెపిల పేర్లతొ ఒక ప్రకటనతో సరిపెట్టారు. చంద్రబాబు, పవన్లు అమరావతికి రాకుండా హైదరాబాద్ వెళ్లారు.

ఎన్ని సీట్లు…?
పొత్తు కుదిరినట్లు ప్రకటించినప్పటికీ సీట్ల పంపకాలపై ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. తెలుగుదేశం నాయకులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో 30 అసెంబ్లీ, 8 పార్లమెంటు స్థానాలను బిజెపి, జనసేనలకు ఇస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. దీనిలో బిజెపికి ఎన్ని జనసేనకు ఎన్ని అన్న అంశాన్ని ఆయన చెప్పలేదు. అదే విధంగా ఏ స్థానాలను కేటాయించారన్న విషయాన్ని కూడా చెప్పలేదు, అయితే, అరకు, రాజమండ్రి, నర్సాపురం, తిరుపతి, హిందూపూర్ రాజంపేట లోక్ సభ స్థానాల్లో బిజెపి పోటీ చేయనున్నట్లు సమాచారం, అనకాపల్లి, కాడినాడ, మచిలీపట్నం మూడు లోకసభ స్థానాల్లో రెండు చోట్ల జనసేన పోటీ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. మిగిలిన 17 లోకసభ, 146 అసెంబ్లీ స్థానాల్లో టిడిపి పోటీ చేయనుంది.

మోదీ నాయకత్వంలో…..!
ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాయకత్వంలో కలిసి పనిచేయడానికి చంద్ర బాబు, పవన్లు అంగీక రించారని మూడు పార్టీల ఉమ్మది ప్రకటనను బిజెపి కేంద్ర కార్యాలయం విడుదల చేసింది. ‘ చైతన్యవంతమైన, మారదృష్టి గల ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాయకత్వంలో బిట్రెపి, టిడిపి, జనసేనలు లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించారు’ అని పేర్కొన్నారు. ఒకప్పుడు ప్రతిపక్ష కూటమికి నాయకత్వం వహించి, కేంద్రంలో అధికారాన్ని పంచుకున్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మరొకరి కింద పనిచేయాల్సి రావడం ఆ పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది.

2019ని విస్మరించారు….
ఉన్నది ప్రకటనలో 1996, 2014 ఎన్నికల్లో బిజెపి, టిడిపి కలిసి పోటీ చేసిన విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ఆ విధంగానే ఈ ఎన్నికల్లో నూ కలిసి పోటీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, 2019 ఎన్నికల సందర్భంగా టిడిపి అనుసరించిన వైఖరిని విస్మరించారు. 2018లోనే బిజెపితో చంద్రబాబు తెగతెంపులు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ ఏడాది మార్చి 16వ తేదిన బిజెపితో తెగతెంపులు చేసుకున్న ఆయన, రాష్ట్రానికి బిజెపి చేస్తున్న అన్యాయంపై అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. బిజెపి చేసిన ద్రోహంపై ఏదు శ్వేత పత్రాలు విడుదల చేశారు ప్రత్యేకహోదా, పోలవరం, అమరావతి, విశాఖ రైల్వే బోన్ తో పాటు ఇతర విభజన హామీల వంటివి వీటిలో ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో దీక్షలు నిర్వహించారు. అదనంగా ఇప్పును విశాఖ ఉక్కు కూడా చేరింది. బిజెపి వైఖరిలో జనుమంత మార్పు కూడా లేదు, అయినా బాబు బిజెపితో ఎందుకు జత కట్టారో అర్థంకాదు. ఆయన మాత్రం రాష్ట్ర ప్రయోజనాల కోసం అంటారు. కాని, అవేమిటో చెప్పరు!

మైనార్టీలకు ఏం చెబుతారు…?
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుండి అత్యధిక సందర్భాల్లో మైనార్టీలు ఆ పార్టీతోనే ఉన్నారు. బిజెపి మతోన్మాద రాజకీయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2014లో కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి దేశ వ్యాప్తంగా మైనార్టీలకు రక్షణ కరవైన విషయం తెలిసిందే, ఆ పార్టీ నామమాత్రంగా ఉన్న మన రాష్ట్రంలోనూ గుంటూరు జిన్నా టవర్, రథం దగ్ధం వంటి వివాదాలతో ఘర్షణలను రేకత్తించడానికి ప్రయత్నించింది. చైతన్యవంతమైన ప్రజానీకం వాటిని తిప్పికొట్టారు. మణిపూర్లో సాగుతున్న మారణహోమం బిజెపి మతోన్మాద రాజకీయాలకు తాజా ఉదాహరణ టిడిపి, జనసేన అందించే పొత్తు బిలంతో రాష్ట్రంలోనూ ఉన్మాదం చెలరేగితే మైనార్టీలకు చంద్రబాబు, పవన్లు ఏం జవాబు చెబుతారన్నది చర్చనీయాంశంగా మారింది,

➡️