బిగ్‌బాస్‌ విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదు

Dec 18,2023 15:50 #bigg boss

హైదరాబాద్‌ : బిగ్‌ బాస్‌ విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదైంది. జూబ్లీహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో పోలీసులు పబ్లిక్‌ న్యూసెన్స్‌ కింద సుమోటోగా కేసు నమోదు చేసినట్లు సమాచారం. 147, 148, 290, 353, 427, 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక, నిన్న రాత్రి బిగ్‌ బాస్‌ విన్నర్‌గా పల్లవి ప్రశాంత్‌ని అనౌన్స్‌ చేసిన తర్వాత బస్సులు, కంటెస్టెంట్ల వాహనాలపై ఆయన ఫ్యాన్స్‌ దాడి చేసిన విషయం తెలిసిందే.

➡️