బిల్లుల కోసం పెద్దిరెడ్డిని అడ్డగించిన వైసిపి నేతలు

ప్రజాశక్తిా వి.కోట (చిత్తూరు జిల్లా):తమకు నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వం బకాయి ఉన్న నీటి బిల్లులను వెంటనే చెల్లించాలని కోరుతూ మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయ్ ని సొంత పార్టీకి చెందిన వైసిపి నేతలు చిత్తూరు జిల్లా వి.కోట మండలం దానమయ్యగారిపల్లి సమీపంలోని టోల్‌ ప్లాజా వద్ద బుధవారం అడ్డుకున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తాగునీటి ఎద్దడి నివారించే లక్ష్యంతో ట్యాంకర్లతో గ్రామాలకు నీటిని అందించామని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన రూ.20 కోట్ల మేరకు బిల్లులు ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తోందని, పలుమార్లు అమరావతికి వెళ్లి వైసిపి అధినాయకత్వానికి విన్నవిచ్చినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంత్రికి వినతిపత్రం అందజేశారు. దీంతో, మంత్రి స్పందిస్తూ, బిల్లుల చెల్లింపునకు త్వరలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం కుప్పం పర్యటనకు వెళ్లారు.

➡️