బేగంపేటలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు

Feb 6,2024 16:25 #Begumpet, #Highest temperatures

హైదరాబాద్‌ : వేసవి కాలం రాకముందే హైదరాబాద్‌ నగరంలో ఎండలు దంచికొడుతున్నాయి. మంగళవారం మోండా మార్కెట్‌, హయత్‌ నగర్‌, బేగంపేట్‌ ఏరియాల్లో అత్యధికంగా 36.3 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. తెలంగాణ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ ప్లానింగ్‌ సొసైటీ నివేదిక ప్రకారం.. కాప్రా, సరూర్‌ నగర్‌, చార్మినార్‌, రాజేంద్రనగర్‌, మెహిదీపట్నం, జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌లో కూడా 35 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.రాబోయే రెండు రోజుల పాటు కూడా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఈ క్రమంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇక రాత్రి సమయాల్లో పలు ప్రాంతాల ప్రజలు ఉక్కపోతకు గురవుతున్నారు. 21.9 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గతేడాది ఫిబ్రవరి 6వ తేదీన మారేడుపల్లిలో 14.7 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. కానీ ఈసారి 19.3 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.

➡️