భావితరాల భవిష్యత్తు కోసం జగన్‌ను గద్దె దించాలి : చంద్రబాబు

Mar 2,2024 20:35 #Nara Chandrababu, #nelluru, #speech

అమరావతి : ఏపీలో భావితరాల భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను గద్దె దించాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లాలో వైసీపీ నాయకుడు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి శనివారం టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.

రాష్ట్రాన్ని నాశనం చేసిన వ్యక్తిని ఇంటికి పంపించాల్సిన సమయం వచ్చిందని, ఆ బాధ్యత ప్రజలందరిపై ఉందని అన్నారు. ప్రశ్నించిన వారిని వేధించడమే సీఎం జగన్‌ పనిగా పెట్టుకున్నారని, తాగునీటి కోసం ట్రాక్టర్‌తో చంపించిన ఘనుడని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యానికి గౌరవం ఇచ్చే పార్టీ అని స్పష్టం చేశారు. రాష్ట్రం, ప్రజలపై ఎలాంటి గౌరవం లేని వ్యక్తి సీఎంగా ఉండేందుకు ఏమాత్రం అర్హత లేదని పేర్కొన్నారు.

రాష్ట్రంలో రాబోయేది టీడీపీ , జనసేన కూటమియేనని దీమాను వ్యక్తం చేశారు. వైఎస్‌ వివేకా హత్య కేసును ఎందుకు తేల్చలేదని జగన్‌ చెల్లెలు సునీత ప్రశ్నించారని, బాబారు హత్యపై సమాధానం చెప్పేందుకు ఎందుకు సిద్ధంగా లేవని ప్రశ్నించారు. ధైర్యంగా మాట్లాడితే ఆమెపైనా కేసులు పెట్టి వేధించారని, నేర స్వభావం ఉన్న వ్యక్తులు ఎలాంటి నీచానికైనా దిగజారుతారని విమర్శించారు.

దాచేపల్లి: రాష్ట్రాన్ని కాపాడుకొనేందుకు ప్రజలంతా సిద్ధం కావాలని టిడిపి అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లిలో ఏర్పాటు చేసిన ‘రా.. కదలిరా’ సభలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకఅష్ణదేవరాయలు తెదేపాలో చేరారు. ఆయనకు చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పల్నాడు జిల్లాలో తలపెట్టిన వాటర్‌గ్రిడ్‌, వరికిపుడిసెల ఎత్తిపోతలను ఏడాదిలోగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా అభివృద్ధికి తమ వెంట నడవాలని కోరారు.

”కార్యకర్తలను కాపాడుకునేందుకు యరపతినేని ఎన్నో త్యాగాలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కులమతాలకు అతీతంగా ఓటు వేయాలి. వైసిపి ప్రభుత్వం పనైపోయిందని పోలీసులు కూడా గ్రహించాలి. హు కిల్డ్‌ బాబారు ప్రశ్నకు జగన్‌ ఇప్పటికైనా సమాధానం చెప్పాలి. బాబాయ్ ను ఎవరు చంపారో చెప్పిన తర్వాతే ఓట్లు అడగాలి. హత్యలు చేసేవారు రాజకీయాలకు పనికిరారని, ఎంతో బాధతో అన్న పార్టీకి ఓటు వేయొద్దని మీ చెల్లే చెప్పింది. సొంత చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి.. రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తాడా? టిషఉ్య పేపర్‌లా వాడుకుంటారు.. జగన్‌ది యూజ్‌ అండ్‌ త్రో విధానం. మరో 40 రోజుల్లో జగన్‌ను ఇంటికి పంపేందుకు జనం సిద్ధంగా ఉన్నారు. బెంగళూరు, ఇడుపులపాయ, కడప, హైదరాబాద్‌, తాడేపల్లిలో జగన్‌కు ప్యాలెస్‌లు ఉన్నాయి. అవన్నీ సరిపోక రుషికొండలో మరో ప్యాలెస్‌ కట్టారు” అని చంద్రబాబు విమర్శించారు.

➡️