మద్దతివ్వండి- ప్రజలకు సిఎం జగన్‌ లేఖ

Mar 15,2024 22:12 #ap cm jagan, #letter

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :వైసిపి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన వాటికంటే ఎక్కువ వాగ్దానాలిచ్చి అమలు చేశామని, రానున్న ఎన్నికల్లో ప్రజలు తమను ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం ప్రజలకు ఆయన బహిరంగ లేఖ రాశారు. తమ పార్టీ 129 హామీలిచ్చి 128 హామీలను అమలు చేసిందని తెలిపారు. గత ఐదేళ్లలో 1.5 కోట్ల కుటుంబాలకు రూ.2.55 లక్షల కోట్లను నేరుగా ప్రజలకు అందించామన్నారు. తమ ప్రభుత్వం ద్వారా 2.6 కోట్ల మందికి నేరుగా లబ్ధి చేకూరిందన్నారు. రాష్ట్రంలో మొదటిసారి ఒసి కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందించామని గుర్తు చేశారు. రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి చెప్పాడంటే చేస్తాడంతే అనే రీతిలో పని చేశామని తెలిపారు.

➡️