మరో పది మందితో వైసిపి ఆరో జాబితా

Feb 3,2024 08:30 #YCP is the sixth list

– జిడి నెల్లూరు, ఎమ్మిగనూరు, చిత్తూరు ఎంపి అభ్యర్థుల మార్పు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:రానున్న ఎన్నికల్లో వైసిపి తరపున పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి ఆ పార్టీ పది మందితో ఆరో జాబితాను విడుదల చేసింది. గతంలో గంగాధర నెల్లూరుకు చిత్తూరు ఎంపి రెడ్డప్పను, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే కె నారాయణస్వామిని చిత్తూరు ఎంపి అభ్యర్థిగా ప్రకటించారు. అయితే డిప్యూటీ సిఎం కె నారాయణస్వామి ఎంపిగా పోటీ చేయలేనని అసెంబ్లీకే పంపాలని ఒత్తిడి తేవడంతో తిరిగి గంగాధర నెల్లూరు అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించింది. చిత్తూరు ఎంపిగా సిట్టింగ్‌ ఎంపి ఎన్‌ రెడ్డప్పనే ప్రకటించింది. అలాగే రెండో విడత జాబితాలో ఎమ్మిగనూరు నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించిన మాచాని వెంకటేష్‌ స్థానంలో మాజీ ఎంపి బుట్టా రేణుక పేరును ప్రకటించింది. రాజమండ్రి ఎంపి అభ్యర్థిగా గూడూరి శ్రీనివాస్‌, నర్సాపురం స్థానానికి అడ్వకేట్‌ గూడూరి ఉమాబాల, గుంటూరు పార్లమెంటుకు ఉమ్మారెడ్డి రమణ, మైలవరం అసెంబ్లీకి సర్నాల తిరుపతిరావు యాదవ్‌, మార్కాపురం అసెంబ్లీకి అన్నా రాంబాబు, గిద్దలూరుకు కె నాగార్జునరెడ్డి, నెల్లూరు సిటికి ఎమ్‌డి ఖలీల్‌ను ప్రకటించింది. ఉత్తరాంధ్ర పార్లమెంటు నియోజకవర్గాలకు రీజనల్‌ కోాఆర్డినేటర్‌గా వైవి సుబ్బారెడ్డిని పార్టీ నియమించింది. అలాగే అరకు పార్లమెంటు పరిధిలోని సాలూరు, పార్వతీపురం, కురుపాం, పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గాలు, విజయనగరం, శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గాలకు మజ్జి శ్రీనివాసరావును డిప్యూటీ రీజనల్‌ కో-ఆర్డినేటర్‌గా నియమించింది.

➡️