మరో రెండు గ్యారెంటీలపై సిఎం రేవంత్‌ రెడ్డి కీలక ప్రకటన?

ఆదిలాబాద్‌ : ఇంద్రవెల్లిలో ఫిబ్రవరి 2 జరగబోయే తెలంగాణ పునర్నిర్మాణ బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. దాదాపు లక్ష మందితో భారీ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి , రాష్ట్ర మంత్రులు ఈ సభకు హాజరుకానున్నారు. రేపు మధ్యాహ్నం 1:45 కు సీఎం రేవంత్‌ కేస్లాపూర్‌ చేరుకోనున్నారు. నాగోబా ఆలయ దర్శనం అనంతరం పలు అభివఅద్ధి పనులను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3:30 గంటలకు రోడ్డు మార్గంలో ఇంద్రవెల్లికి సీఎం రేవంత్‌ రెడ్డి చేరుకోనున్నారు. ముందుగా అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అక్కడ జరిగే భారీ సభలో సీఎం ప్రసంగించనున్నారు. కాగా.. ముఖ్యమంత్రి తొలి పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరో రెండు గ్యారెంటీల అమలుపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే ఇదే వేదిక నుంచి పార్లమెంట్‌ ఎన్నికల శంఖారావాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మోగించనున్నారు.

➡️