మహాలక్ష్మి పథకం అద్భుతంగా అమలవుతుంది : సజ్జనార్‌

Jan 6,2024 17:05 #speech, #tsrtc md sajjanar

హైదరాబాద్‌: మియాపూర్‌ డిపో 2లో ఘనంగా వనభోజనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ హాజరయ్యారు. అనంతరం విధి నిర్వహణలో అద్భుతంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ మాట్లాడుతూ….టీఎస్‌ ఆర్టీసీలో వనభోజనాలు కార్యక్రమం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. ఉద్యోగులంతా స్నేహపూర్వక వాతావరణంలో కలిసి వనభోజనాలు కార్యక్రమం చేసుకోవడం మంచి పరిణామమని చెప్పారు. టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులు కష్టపడి పని చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా తీసుకున్న మహాలక్ష్మి పథకం అద్భుతంగా అమలవుతుందని తెలిపారు. మహిళలు ఆర్టీసీలో ప్రయాణం చేసేటప్పుడు ఒరిజినల్‌ గుర్తుంపు కార్డు తీసుకొని సిబ్బందికు సహకరించాలని ఎండీ సజ్జనార్‌ కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీ ట్రాఫిక్‌ వేణుగోపాల్‌, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.

➡️