మింట్ కాంపౌడ్‌లో ఘోర అగ్ని ప్రమాదం

Jan 24,2024 11:21 #Fatal fire accident, #hyderabad

హైదరాబాద్ : హైదరాబాద్‌లో వరుస అగ్ని ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. తాజాగా బుధవారం మింట్ కాంపౌండ్ ప్రభుత్వ పుస్తక ముద్రణా కార్యాలయంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముద్రణా యంత్రాలు, పలు పుస్తకాలు కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక సిబ్బంది వెల్లడించారు. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

➡️