‘మే 13 మేము సిద్ధం’.. సీఎం జగన్‌ ట్వీట్‌

Mar 16,2024 17:57 #ap cm jagan, #tweets

గుంటూరు: ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసిన నేపథ్యంలో ’13, 2024 సిద్ధం’.. అంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్‌ చేశారు. దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసింది కేంద్ర ఎలక్షన్‌ కమిషన్‌. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ సీట్లకు, 25 లోక్‌ సభ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నటు పేర్కొంది. ఈ ఎన్నికలను ఏడు దశల్లో నిర్వహించనుండగా, ఏపీలో ఎన్నికలు నాల్గో విడతలో నిర్వహించనున్నట్లు సీఈసీ తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌లో మే 13వ తేదీన పోలింగ్‌, జూన్‌ 4వ తేదీన కౌంటింగ్‌ ఉంటుందని సీఈసీ తెలిపింది.

➡️