యథావిధిగా పాలిసెట్‌

Mar 20,2024 21:35 #ap polycet

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :పాలిసెట్‌-2024 పరీక్ష ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం యథావిధిగా ఏప్రిల్‌ 27న ఉంటుందని సాంకేతిక విద్యాశాఖ కమిషనరు సిహెచ్‌ నాగరాణి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం apsbtet.ap.gov.in, sbtet.ap.gov.in వెబ్‌సైట్లను సందర్శించాలని సూచించారు. పాలిటెక్నిక్‌ (సి20), 4, 5 సెమిస్టర్ల సాధారణ పరీక్షలు ఏప్రిల్‌ 18 నుంచి ప్రారంభం కానున్నాయని తెలిపారు. పరీక్షల షెడ్యూల్‌ను అనుసరించి అన్ని పరీక్షలు అదే తేదీన ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అపరాధ రుసుం లేకుండా పరీక్ష ఫీజు ఈ నెల 26వ తేది వరకు చెల్లించవచ్చునని వెల్లడించారు. సి23 మొదటి సంవత్సరం పరీక్షలు మే 2 నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు.

➡️