రాజమహేంద్రవరం రూరల్‌ టికెట్‌ దుర్గేష్‌కి కేటాయించాలి

Feb 27,2024 20:45 #JanaSena, #Rally

జనసేన ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం రూరల్‌ :రాజమహేంద్రవరం రూరల్‌ టికెట్‌ను జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్‌కి కేటాయించాలంటూ కడియంలోని దేవీచౌక్‌ సెంటర్‌ నుంచి రాజమహేంద్రవరం డీలక్స్‌ సెంటర్‌ వరకూ ఆ పార్టీ నాయకులు మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన బలోపేతానికి కందుల దుర్గేష్‌ ఎనలేని కృషి చేశారన్నారు. ప్రజల ఆదరాభిమానాలు ఉన్న నాయకుడు దుర్గేష్‌కి రూరల్‌ టికెట్‌ ఇస్తానని నమ్మకం కల్పించి చివరకు పొత్తులో భాగంగా దాన్ని దూరం చేయడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆది నుంచి పార్టీకి విధేయునిగా ఉంటున్న నాయకుడిని ఇలా దూరం చేసుకోవడం తగదన్నారు. ప్రాబల్యంలేని నిడదవోలుకు వెళ్లి పోటీ చేయమనడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. ఈ ఈ కార్యక్రమంలో గట్టి నరసయ్య, గట్టి సుబ్బారావు, చెరుకూరి రామారావు, ముద్రగడ జమీ, బాక్స్‌ ప్రసాద్‌, మండల అధ్యక్షుడు సిహెచ్‌ చెన్నారావు, గడ్డం శివ, బీరా ప్రకాష్‌, యడ్ల మహేష్‌, యడ్ల వెంకటేష్‌, షేక్‌ అమీనా తదితరులు పాల్గొన్నారు.

➡️