రేేపు తెలంగాణ క్యాబినెట్‌ భేటీ.. కీలక అంశాలపై చర్చ

Jan 7,2024 16:10 #cabinet meeting, #tomorrow

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి నెల రోజులు పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో రేపు తెలంగాణ క్యాబినెట్‌ భేటీ కానున్నది. ముఖ్యంగా నెల రోజుల కాంగ్రెస్‌ పరిపాలన, ఆరు గ్యారంటీల అమలుపై ఈ సమావేశంలో చర్చ జరుగనుంది. అదేవిధంగా పలు కీలక అంశాలు కూడా ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా, మల్లు భట్టివిక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్‌ అధికారం చేపట్టిన తర్వాత తొలి నెల రోజుల పాలన పూర్తయ్యింది. ఈ నెల రోజుల నుంచి కాంగ్రెస్‌ ప్రభుత్వం.. కేసీఆర్‌ సర్కారు రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిందని ఆరోపిస్తున్నది. ఈ ఆరోపణలను బీఆర్‌ఎస్‌ తిప్పికొట్టింది. ఆరు గ్యారంటీల అమలు నుంచి తప్పించుకునేందుకే కాంగ్రెస్‌ ఈ కుటిల ఆరోపణలు చేస్తోందని మండిపడింది.

➡️