లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన ఎమ్మెల్యే లాస్య నందిత!

Dec 24,2023 14:45 #lift jom, #mla lasya nanditha

హైదరాబాద్‌: కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. సికింద్రాబాద్‌లో ఓ కార్యక్రమానికి ఎమ్మెల్యే లాస్య నందిత వెళ్లగా.. ఆమె ఎక్కిన లిఫ్ట్‌ ఓవర్‌లోడ్‌ కారణంగా కిందకి వెళ్లిపోయింది. దాంతో లిఫ్ట్‌లో ఉన్న ఎమ్మెల్యే ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఎమ్మెల్యే వ్యక్తిగత సిబ్బంది వెంటనే అప్రమత్తం అయి లిఫ్ట్‌ డోర్లు బద్దలు కొట్టారు. దాంతో ఎమ్మెల్యే లాస్య నందిత సురక్షితంగా బయటకు వచ్చారు.కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న చిన్న కుమార్తె లాస్య నందిత. సాయన్న మరణించడంతో ఆ స్థానం నుంచి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కుమార్తె పోటీ చేశారు. ఈ టికెట్‌ కోసం స్థానిక నేతలు కొందరు గట్టి ప్రయత్నాలే చేసినా.. కేసీఆర్‌ నందితపై నమ్మకం ఉంచారు. 2016లో కవాడిగూడ నుంచి లాస్య నందిత కార్పొరేటర్‌గా గెలిచారు. అయితే 2020లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో మాత్రం ఆమె ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి తండ్రి వెంటే ఉంటూ నియోజకవర్గంలో మంచి పట్టు పెంచుకున్నారు.

➡️