లేపాక్షి ఆలయాన్నిసందర్శించిన కేంద్ర మంత్రి

Dec 25,2023 08:47 #Central Minister

ప్రజాశక్తి – లేపాక్షి (సత్యసాయి జిల్లా):సత్యసాయి జిల్లా లేపాక్షి మండల కేంద్రలో ప్రసిద్ధి గాంచిన ఏకశిలా నంది, దుర్గా వీరభద్ర పాపానసేశ్వర ఆలయాన్ని కేంద్ర టెలీ కమ్యూనికేషన్‌ సహాయ శాఖ మంత్రి దేవ్‌సిన్హా చౌహాన్‌ ఆదివారం సందర్శించారు. ఆలయ అర్చకులు ఆయనకు స్వాగతం పలికి ఆలయ విశిష్టతను తెలిపారు. అనంతరం వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రలో భాగంగా లేపాక్షిలోని ఒరియంటల్‌ ఉన్నత పాఠశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర మంత్రి పాల్గన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న పథకాలను వివరిస్తూ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వం పేదలకోసం ప్రవేశపెట్టిన పథకాల గురించి వివరించారు. ఆయన వెంట పెనుగొండ సబ్‌ కలెక్టర్‌ భరత్‌ కుమార్‌, డిప్యూటీ తహశీల్దార్‌ కుమార్‌ రెడ్డి, ఎంపిడిఒ నరసింహ నాయుడు ఉన్నారు.

➡️