వింగ్స్‌ ఇండియా 2024 ప్రదర్శన – సందర్శకుల సందడి

బేగంపేట (తెలంగాణ) : హైదరాబాద్‌ బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్‌ ఇండియా – 2024 ప్రదర్శనకు మూడో రోజు సందర్శకులను అనుమతించడంతో ఆ ప్రాంతమంతా సందడి నెలకొంది. మొదటి 2 రోజులు పూర్తిగా వాణిజ్యపరంగా కార్యక్రమం జరిగింది. నేడు, రేపు సందర్శకులను విమానాశ్రయంలోనికి అనుమతిస్తున్నారు. దీనికోసం ‘బుక్‌మై షో’లో ముందుగా టికెట్లు కొనుక్కోవాల్సి ఉంటుంది. ఎంట్రీ ఫీజు ఒక్కొక్కరికి రూ.750గా నిర్ణయించారు. మూడేళ్లలోపు పిల్లలకు ప్రవేశం ఉచితం. అయితే, సందర్శకులు విమానాల్లోకి నేరుగా వెళ్లే వీలు లేదు. ఈ ప్రదర్శనలో ప్రతి విమానం పక్కన 30 అడుగుల మేర బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆయా సంస్థల ప్రతినిధులు దాని ప్రత్యేకతలను వివరిస్తున్నారు. కేవలం ప్రదర్శన మాత్రమే కాకుండా వినోదం కోసం మధ్యాహ్నం 3 గంటలకు శివమణి బృందంతో సంగీతోత్సవాన్ని ఏర్పాటు చేశారు.

➡️